ఇంతకీ కాజల్ అగర్వాల్ పరిస్థితి ఏంటి...?

Wednesday,June 12,2019 - 11:03 by Z_CLU

కాజల్ అగర్వాల్ సినిమాల్లేకుండా ఖాళీగా ఉందా..? అస్సలు కాదు.. గతేడాది 2 సినిమాల్లో నటించింది. ఈ ఏడాది ఆల్రెడీ ‘సీత’ రిలీజయింది. ఇప్పుడు శర్వానంద్ సరసన ‘రణరంగం’ లోకూడా నటిస్తుంది. కాజల్ కి సినిమా ఆఫర్ల విషయంలో ఇబ్బంది లేదు.. హిట్టే ఎంతకీ పడట్లేదు.

లాస్ట్ ఇయర్ ‘కవచం’ డిజప్పాయింట్ చేసింది. కళ్యాణ్ రామ్ తో చేసిన M.L.A. కూడా అంతే. ఏ మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. సరే… ఈ ఏడాదైనా కాజల్ పరిస్థితి కొంచెం ట్రాక్ లో పడుతుందేమో అనుకుంటే, డిఫెరెంట్ సినిమా అనుకుంటూ వచ్చిన ‘సీత’ కూడా కాజల్ ని ఇబ్బందుల్లో పడేసింది.

‘సీత’ లో కాజల్ అగర్వాల్ పర్ఫామెన్స్ బావుంది అనే ఇంప్రెషన్ తప్ప, ఈ సినిమా ఏ మాత్రం కలిసిరాలేదు. ఫ్లాప్స్, హిట్స్ కామనే.. ఇక్కడ టాపిక్ అది కాదు కానీ ఇలా వరస ఫ్లాపులే ఉంటే కాజల్ ఇరకాటంలో పడే అవకాశమైతే చాలా ఉంది.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘రణరంగం’ హిట్టయితే మళ్ళీ కాజల్ అగర్వాల్ కి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ కాస్తంత తేడా పడ్డ కాజల్ అగర్వాల్ బ్యాక్ టు స్ట్రగుల్ స్టేజ్ అనిపించుకుంటుంది.