సీక్వెల్ కి రెడీ అవుతున్న నిఖిల్...

Sunday,May 21,2017 - 12:30 by Z_CLU

లేటెస్ట్ గా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘కేశవ’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న హీరో నిఖిల్ త్వరలోనే ‘కార్తికేయ’ సీక్వెల్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.’కార్తికేయ’ తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన చందు మొండేటి దర్శకత్వం లోనే ఈ సీక్వెల్ ను ప్లాన్ చేస్తూ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడు నిఖిల్.

కార్తికేయ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ఈ కథ స్టార్ట్ అవుతుందని, ప్రస్తుతం చందు ఆ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని ఈ ఏడాదే ఈ సీక్వెల్ ను సెట్స్ పై పెట్టబోతున్నట్లు తెలిపాడు నిఖిల్. సో కెరీర్ లో ఫస్ట్ టైం నిఖిల్ ఓ సీక్వెల్ సినిమా ప్లాన్ చేస్తూ ఆ సినిమాతో మరో సారి ఎంటర్టైన్ చేయబోతున్నాడన్నమాట….