హిట్ కాంబినేషన్ రిపీట్....

Tuesday,March 21,2017 - 10:30 by Z_CLU

ఓ సినిమా హిట్ అయితే చాలు హీరో గా ఆ దర్శకుడికి మరో సారి ఛాన్స్ ఇచ్చి ఆ కాంబోలో మరో హిట్ అందుకోవాలని చూస్తారు.. ప్రెజెంట్ అలా ఓ ఇద్దరు టాప్ హీరోలతో పాటు ఇద్దరు యంగ్ హీరోస్ కూడా తమకు గ్రాండ్ హిట్ అందించిన దర్శకుడితో రిపీట్ అంటూ ఆ కాంబో తో మరో గ్రాండ్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. మరి హిట్ కాంబోను రిపీట్ చేస్తూ సినిమా పై అంచనాలు పెంచేస్తున్న ఆ హీరోలెవరో చూద్దాం..

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ఈ కాంబో లో సినిమా వస్తుందంటే చాలు అటు ఫాన్స్ తో పాటు ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూద్దమా.. అని వెయిట్ చేస్తుంటారు. అంతగా ప్రేక్షకుల పై ఇంపాక్ట్ చూపించింది ఈ సెన్సేషనల్ కాంబో.. మొదటి సారి జల్సా తో జత కట్టిన ఈ కాంబో సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది’ తో సెన్సేషనల్ హిట్ అందుకొని క్రేజీ కాంబో గా నిలిచింది. అందుకే లైన్ లో ఎంత మంది దర్శకులన్నా త్రివిక్రమ్ తోనే నెస్ట్ సినిమా కమిట్ అయ్యాడు పవన్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది. మరి ఈ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూడో సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి..


మహేష్-కొరటాల కాంబినేషన్ అనగానే టక్కున గుర్తొచ్చే సినిమా ‘శ్రీమంతుడు’. టాలీవుడ్ లో ఈ సినిమా సాధించిన విజయం అంత ఇంతా కాదు. ఓ సోషల్ మెసేజ్ తో ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఇండస్ట్రీ లో ఒకటిగా నిలిచింది. అందుకే ఏ మాత్రం ఆలోచించకుండా మిగతా దర్శకులను పక్కన పెట్టి మరీ కొరటాలతో మరో సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ బ్లాక్ బస్టర్ కాంబోలో తెరకెక్కనున్న సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటూ సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీగా ఉంది.. ఈ కాంబోలో రానున్న మరో సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో..


అప్పటికే గ్రాండ్ హిట్ అందుకున్న నాని కి వెంటనే ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’తో మరో సూపర్ హిట్ ఇచ్చాడు దర్శకుడు హనురాఘవపూడి. వరుస హిట్స్ అందుకున్న నాని కెరీర్ లో ఈ సినిమాకు మంచి ఇంపార్టెన్స్ ఉండడం పైగా నాని కి హను క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో వెంటనే హను కి మరో ఛాన్స్ ఇచ్చేశాడు నాని.. ప్రస్తుతం ‘నిన్ను కోరి’ అనే సినిమాలో నటిస్తున్న నాని త్వరలోనే హను కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు..

అప్పటి వరకూ అపజయాలతో కొనసాగుతున్న రామ్ కెరీర్ ను హిట్ ట్రాక్ లో నిలబెట్టిన సినిమా ‘నేను శైలజ’. లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడం తో వెంటనే దర్శకుడు కిషోర్ తిరుమలతో అప్పుడే మరో సినిమా అనౌన్స్ చేసేశాడు రామ్. ప్రస్తుతం తనకు సూపర్ హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమలతో దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేయబోతున్న రామ్ ఈ సినిమా కోసం సరి కొత్త లుక్ తో ఎంటర్టైన్ చేయబోతున్నాడు. మరి ‘నేను శైలజ’ తర్వాత ఈ కాంబోలో రానున్న సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ సాధిస్తుందో..చూడాలి…