గురు ట్రయిలర్ - ఈ పాటలు అందుకే మిస్సింగ్

Tuesday,March 21,2017 - 11:14 by Z_CLU

కొన్ని సినిమాలు చూస్తే అందులో నటించిన హీరో సీనియారిటీ కనిపిస్తుంది. అతడి కమిట్ మెంట్ ఏంటో తెలుస్తుంది. ఇన్నేళ్లయినా సినిమా అంటే ప్యాషన్ తగ్గలేదని అనిపిస్తుంది. గురు ట్రయిలర్ చూస్తే ఇవన్నీ ఒకేసారి మనసుకు తడతాయి. విక్టరీ వెంకటేష్ అప్ కమింగ్ మూవీ గురు ట్రయిలర్, కేవలం దగ్గుబాటి ఫ్యాన్స్ నే కాదు.. టోటల్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసి పడేసింది.

చేసింది రీమేకే అయినా అందులో ఎలాంటి రిమార్క్స్ లేకుండా తన మార్క్ చూపించాడు వెంకీ. మోస్ట్ ఎగ్రెసివ్ గా, సీరియస్ గా కనిపించి బాక్సింగ్ కోచ్ క్యారెక్టర్ కు ఓ బరువైన ఇమేజ్ తీసుకొచ్చాడు. నెరిసిన గడ్డం, దిట్టమైన ఫిజిక్ తో తెలుగులో ఈ క్యారెక్టర్ ను వెంకీ తప్ప మరెవరూ చేయలేేరు అన్నట్టుగా గురు ట్రయిలర్ కట్ అయింది.

హీరోయిన్ రితికా సింగ్ మరోసారి అద్భుతంగా కనిపించింది. ఆల్రెడీ చేసిన పాత్రే అయినప్పటికీ ఎక్కడా ఆ ఫీల్ కనిపించకుండా జాాగ్రత్తపడింది. విశాఖ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ సినిమా కు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించాడు. ట్రయిలర్ లో సీరియస్ నెస్ మిస్ అవ్వకుండా ఉండేందుకు… జింగిడి జింగిడి, ఓ సక్కనోడా లాంటి పాటల్ని ట్రయిలర్ లో పెట్టలేదు. ఓవరాల్ గా గురు ట్రయిలర్ సినిమాపై బజ్ ను డబుల్ చేసింది.