ఆ ముగ్గురితో త్రివిక్రమ్

Tuesday,March 21,2017 - 09:30 by Z_CLU

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ ఏడాది తో పాటు వచ్చే ఏడాది కూడా దర్శకుడిగా ఫుల్ బిజీ కాబోతున్నాడు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ముచ్చటగా మూడో సినిమా చేయడానికి రెడీ అవుతున్న త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా గడుపుతున్నాడు. ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా ప్లాన్ చేసుకున్న ఈ స్టార్ డైరెక్టర్ మరో వైపు మహేష్ ని కూడా లైన్ లో పెట్టేశాడు..

పవన్, ఎన్టీఆర్ సినిమాలు పూర్తి కాగానే మహేష్ తో మూడో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా ఫైనల్ అయిందని సమాచారం… ప్రస్తుతం కొరటాలతో సినిమా చేయడానికి రెడీ అవుతున్న మహేష్ ఆ వెంటనే వంశీ పైడిపల్లి తో సినిమాను చేసి ఆ తర్వాత త్రివిక్రమ్ తో జాయిన్ అవ్వాలని చూస్తున్నాడట. ప్రెజెంట్ వీరిద్దరి చేతిలో ఉన్న రెండు సినిమాలు పూర్తి కాగానే ఈ క్రాజీ కాంబో సినిమా సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం…