వెంకటేష్ నాగచైతన్యల మల్టీస్టారర్ లో హీరోయిన్స్ ఫిక్స్..?

Saturday,March 24,2018 - 05:02 by Z_CLU

వెంకటేష్ , నాగచైతన్యల మల్టీస్టారర్ ఆగష్టు నుండి సెట్స్ పైకి రానుంది. ప్రేమమ్ సినిమాలో కామియో రోల్ లో కనిపించి, ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసిన వెంకీ, ఈ సినిమాలో ఫుల్ టైమ్ రోల్ ప్లే చేయనున్నాడు. అయితే అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్స్ కూడా ఫిక్స్ అయ్యారనే న్యూస్, సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది.

ప్రస్తుతానికి ఫిల్మ్ మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, ఈ సినిమాలో వెంకటేష్ సరసన నయనతార, చైతు సరసన సమంతా నటించానున్నారనే న్యూస్, టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో, ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.

 

నయనతార వెంకటేష్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఎంత క్రేజ్ ఉందో, చైతు సమంతా ల జోడీకి కూడా ఫ్యాన్స్ లో అదే రేంజ్ క్రేజ్ ఉంది. మామా అల్లుళ్ళ కాంబినేషన్ లో సినిమా అనగానే క్రియేట్ అయిన ఎక్స్ పెక్టేషన్స్ తో పాటు, నయనతార, సమంతా ల పేర్లు జత చేరేసరికి, ఈ సినిమా చుట్టూ మరిన్ని స్పెక్యులేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.

 

సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ టాక్ జస్ట్ రూమర్ లా మిగిలిపోతుందా..? లేక అఫీషియల్ గా ట్రాన్స్ ఫామ్ అవుతుందా అనేది ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. ఈ సినిమా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కనుంది.