విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ ఫస్ట్ లుక్ రిలీజయింది

Saturday,March 24,2018 - 06:19 by Z_CLU

నిన్న ఫస్ట్ గేర్ పేరిట విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసిన సినిమా యూనిట్, ఈ రోజు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది.  అల్టిమేట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా, ట్యాక్సీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినట్టు తెలుస్తుంది.

ఇప్పటికే ఫ్యాన్స్ లో మాసివ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ‘శివ’ గా మెస్మరైజ్ చేయనున్నాడు. లెదర్ జాకెట్ తో కంప్లీట్ మాస్ లుక్ లో ఉన్న విజయ్ దేవరకొండని స్టైలిష్ గా ప్రెజెంట్ చేస్తున్న ఈ ఫస్ట్ లుక్, సినిమాపై మరింత క్యూరాసిటీని రేజ్ చేస్తుంది.

 

గీతా ఆర్ట్స్ 2 తో పాటు, UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా మే 18 న గ్రాండ్ గా రిలీజవుతుంది. ఈ సినిమాకి రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్టర్.