NTR బయోపిక్ లో విద్యాబాలన్..?

Saturday,March 24,2018 - 03:46 by Z_CLU

తేజ డైరెక్షన్ లో తెరకెక్కనుంది NTR బయోపిక్. ఈ సినిమాలో NTR గా కనిపించబోతున్నాడు బాలకృష్ణ. ఎన్టీఆర్ పొలిటికల్ కరియర్ తో పాటు, ఆయన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలని ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. అయితే ఈ సినిమాలో NTR భార్య బసవ తారకం క్యారక్టర్ కోసం, బాలీవుడ్ నటి విద్యా బాలన్ ను సంప్రదించినట్టు సమాచారం.

రీసెంట్ గా విద్యా బాలన్ ను సంప్రదించిన తేజ, ఈ సినిమాలో బసవ తారకం రోల్ గురించి ఎక్స్ ప్లేన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో ఇప్పటి వరకూ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ, ఈ క్యారెక్టర్ ని ప్లే చేయడానికి విద్యా బాలన్ రేంజ్ స్టార్ అయితేనే బావుంటుందని భావిస్తున్నారట సినిమా యూనిట్.

మార్చి 29 న ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్  చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్. అదే రోజు ఈ సినిమాకు సంబంధించిన తక్కిన టెక్నీషియన్స్ తో పాటు, సినిమాలో కీ రోల్స్ ప్లే చేయనున్న వారి డీటేల్స్ అఫీషియల్ గా కన్ఫం చేస్తారు.