గీతగోవిందం ఆడియో ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్

Thursday,July 26,2018 - 06:13 by Z_CLU

ఈ నెల 29 న గ్రాండ్ గా ఆడియో లాంచ్ జరుపుకోనుంది విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ సినిమా. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో జరగనున్న ఈ ఈవెంట్ లో మరింత ఎట్రాక్షన్ ఆడ్ కానుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ గా రానున్నాడు.

విజయ్ దేవరకొండ సినిమా అంటే యూత్ లో వైబ్రేషన్స్ మామూలే. దానికి తోడు ఇప్పటికే రిలీజైన 2 సాంగ్స్ సినిమాపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేశాయి. ఇప్పటికే సినిమాలోని మిగిలిన సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయోనన్న క్యూరియాసిటీతో ఉన్న ఫ్యాన్స్ లో, ఆడియో లాంచ్ కి అల్లు అర్జున్ అటెండ్ అవుతున్నాడనే న్యూస్ మరింత జోష్ నింపుతుంది.

ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ ఆల్మోస్ట్ 2 స్టేట్స్ యూత్ ని రీచ్ అయింది. ఈ ఆదివారం జరగనున్న ఈ ఈవెంట్ లో ఫిల్మ్ మేకర్స్ ఈ సినిమాకి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకోనున్నారు. దానికి తోడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పీచ్ ఈ ఈవెంట్ లో హైలెట్ కానుంది.

లక్ష్మన్ కార్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తుంది. UV క్రియేషన్స్ బ్యానర్, పాకెట్ సినిమా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సినిమాని ఆగష్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్.