నా సినిమాల్లో 'రణరంగం' బెస్ట్ లవ్ స్టోరీ

Friday,August 16,2019 - 02:44 by Z_CLU

శర్వానంద్ కు లవ్ స్టోరీస్ కొత్తకాదు. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ లవ్ స్టోరీస్ చేశాడు. కానీ అతడి కెరీర్ లో బెస్ట్ లవ్ ట్రాక్ రణరంగంలో ఉందంటున్నాడు ఈ హీరో. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రణరంగం సినిమాలో తనకు, కల్యాణి ప్రియదర్శన్ కు మధ్య వచ్చిన లవ్ ట్రాక్ ది బెస్ట్ అంటున్నాడు.

“ఈ సినిమాలో కల్యాణి, నాకూ మధ్య లవ్ స్టోరీ ఇప్పటివరకు నేను చేసిన లవ్ స్టొరీలన్నింటి కంటే బెస్ట్ అంటున్నారు. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది.”

కొద్దిసేపటి కిందట మీడియాతో మాట్లాడిన శర్వానంద్.. రణరంగంకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయంటున్నాడు. ఓ యాక్షన్ సినిమా చేయాలనుకున్న తమ టార్గెట్ ను రీచ్ అయ్యామని చెప్పుకొచ్చాడు.

“రణరంగం’కు మంచి ఓపెనింగ్స్ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. ప్రేక్షకులకు ఒక స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా ఇవ్వాలనుకొని, ఒక ప్రోపర్ యాక్షన్ ఫిల్మ్ తియ్యాలనుకొని ‘రణరంగం’ చేశాం. ఆ విషయంలో 200 శాతం సక్సెస్ అయ్యాం. ఇటీవల తెలుగులో వచ్చిన బెస్ట్ క్వాలిటీ ఫిల్మ్ అని ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ సూపర్బ్ అనే పేరొచ్చింది. ఫైట్ సీన్స్‌ని వెంకట్ మాస్టర్ చాలా నేచురలిస్టిగ్గా కంపోజ్ చేశారు.”

సినిమాలో చిన్న రోల్ అయినప్పటికీ నటించిన కాజల్ కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాడు శర్వానంద్. రోజురోజుకు సినిమా టాక్ బెటర్ అవుతోందని, రాబోయే రోజుల్లో మరింత మంచి టాక్ వస్తుందంటున్నాడు.