నైజామ్ లో ‘గీతగోవిందం’ హవా

Wednesday,September 12,2018 - 12:04 by Z_CLU

బాక్సాఫీస్ దగ్గర ‘గీతగోవిందం’ హవా ఇంకా నడుస్తూనే ఉంది. సినిమా రిలీజై 4 వారాలు దాటుతున్నా ఈ సినిమా  ఇంపాక్ట్ మాత్రం ఇంకా కలెక్షన్స్ పై కనబడుతూనే ఉంది. మరీ ముఖ్యంగా నైజామ్ లో ఇప్పటికే 19 కోట్లు కలెక్ట్ చేసిన  ఈ సినిమా 20 కోట్ల వసూళ్ళ వైపు పరుగులు పెడుతుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 65 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది గీత గోవిందం.

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ కి దగ్గరైన విజయ్ దేవరకొండని ఫ్యామిలీ ఆడియెన్స్ కి పరిచయం చేసింది ఈ సినిమా. కంప్లీట్ గా డిఫెరెంట్ రోల్ లో మెస్మరైజ్ చేసిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఆడియెన్స్ కి తెగ నచ్చేశాడు. విజయ్ కి తోడు రష్మిక మండన్న పర్ఫామెన్స్ కి ఆడియెన్స్ లో మంచి అప్లాజ్ వచ్చింది.

మ్యూజిక్ దగ్గరి నుండి బిగిన్ అయితే, సినిమాలోని ప్రతి ఎలిమెంట్ ఆడియెన్స్ కి కనెక్ట్ అవ్వడంతో, రిపీటెడ్ ఆడియెన్స్ తో ‘గీతగోవిందం’ బాక్సాఫీస్ దగ్గర ఇంపాక్ట్ చూపిస్తూనే ఉంది. పరశురామ్ డైరెక్షన్ లో ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కింది. గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజర్.