సైరా టీజర్ కు పవన్ వాయిస్ ఓవర్

Friday,August 16,2019 - 12:06 by Z_CLU

చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా టీజర్ లేదా ట్రయిలర్ కు పవర్ స్టార్ వాయిస్ ఓవర్ ఇస్తాడంటూ 2 రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడా పుకార్లు నిజమయ్యాయి. సైరా టీజర్ కు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ విషయాన్ని కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ అఫీషియల్ గా కన్ ఫర్మ్ చేసింది. ఫొటోస్ కూడా షేర్ చేసింది.

సైరా సినిమా టీజర్ కు పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు యూనిట్ థ్యాంక్స్ చెప్పింది. ఇప్పటివరకు చరిత్ర చెప్పని ఓ వీరుడి గాథను ఓ ప్రజానాయకుడు తన గొంతు ద్వారా వినిపిస్తున్నాడంటూ దర్శకుడు సురేందర్ రెడ్డి ట్వీట్ చేశాడు.

టీజర్ కు పవన్ వాయిస్ ఓవర్ అందిస్తున్న టైమ్ లో మెగాస్టార్ పక్కనే ఉన్నారు. అటువైపు దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అన్నయ్య సూచనలు, సలహాలు పాటిస్తూ.. సైరా టీజర్ కు అద్భుతంగా వాయిస్ ఓవర్ అందించాడు పవర్ స్టార్. సైరా టీజర్ ను మరో 4 రోజుల్లో (20న) విడుదల చేయబోతున్నారు.