గీతగోవిందం.. 2 రోజుల్లో రికార్డు వసూళ్లు

Friday,August 17,2018 - 02:30 by Z_CLU

సూపర్ హిట్ అయిన గీతగోవిందం సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల 80 లక్షల రూపాయలు కలెక్ట్ చేసిన ఈ సినిమా.. 2 రోజుల్లో తన షేర్ వాల్యూను 9 కోట్ల రూపాయలకు పెంచుకుంది. దాదాపు 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, ఈ వీకెండ్ కంటే ముందే బ్రేక్-ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

మొదట సూపర్ హిట్ టాక్ తో ప్రారంభమైన ఈ సినిమా తాజా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ సినిమాకు 20 కోట్ల రూపాయల షేర్ రావొచ్చని ట్రేడ్ అంచనా వేస్తోంది. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. వీకెండ్ కంటే ముందే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరబోతోంది.

గీతగోవిందం సినిమాకు రెండో రోజుకే నైజాంలో అదనంగా కొన్ని థియేటర్లు యాడ్ అయ్యాయి. సోమవారం నుంచి ఈ సినిమాకు నైజాంతో పాటు ఏపీలో మరిన్ని స్క్రీన్స్ యాడ్ అవ్వబోతున్నాయి. సో.. ఎలా చూసుకున్నా ఈ సినిమాకు రికార్డు వసూళ్లు గ్యారెంటీ.