వంద కోట్ల క్లబ్ లో చేరిన గీతగోవిందం

Monday,August 27,2018 - 11:36 by Z_CLU

బ్లాక్ బస్టర్ హిట్ అయిన గీతగోవిందం సినిమా నిన్నటితో 12 రోజులు పూర్తిచేసుకుంది. 2 వారాలు కూడా కంప్లీట్ కాకుండానే ఈ సినిమా 2 అరుదైన రికార్డులు సృష్టించింది. ఓవర్సీస్ లో ఈ సినిమా టాప్-10 లిస్ట్ లోకి చేరడంతో పాటు వరల్డ్ వైడ్ 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అటు షేర్ పరంగా 50 కోట్ల క్లబ్ లోకి కూడా గ్రాండ్ గా ఎంటరైంది.

మరోవైపు చెన్నై, కేరళలో కూడా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. చెన్నైలో ఇప్పటివరకు బ్రహ్మాండంగా ఆడిన తెలుగు సినిమాల జాబితాలో గీతగోవిందం 5వ స్థానానికి ఎగబాకింది. ఈ సినిమాకు చెన్నైలో కోటి రూపాయల షేర్ దాటిపోయింది. అటు కేరళలో కూడా ఆట్ టైం తెలుగు హిట్స్ సరసన చేరిపోయింది.

ఏపీ, నైజాం 12 రోజుల షేర్

నైజాం – రూ. 15.2 కోట్లు
సీడెడ్ – రూ. 5.70 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.9 కోట్లు
ఈస్ట్ – రూ. 2.76 కోట్లు
వెస్ట్ – రూ. 2.3 కోట్లు
గుంటూరు – రూ. 2.81 కోట్లు
కృష్ణా – రూ. 2.84 కోట్లు
నెల్లూరు – రూ. 1.13 కోట్లు