సమంతా లైఫ్ లో జరిగింది నిజమా..? అబద్ధమా..?

Friday,August 17,2018 - 03:28 by Z_CLU

మోస్ట్ ఇంటెన్సివ్ థ్రిల్లర్ లా తెరకెక్కుతుంది సమంతా ‘యూటర్న్’. సెప్టెంబర్ 13 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచేసిన ఫిలిమ్ మేకర్స్, ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. 2:08 సెకన్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తుంది.

‘నేను ఈ రకంగా ఈ బార్ కౌంటర్ లో, ఇన్ని శబ్దాల మధ్య ఇలా కూర్చుంటానని ఎప్పుడూ అనుకోలేదు…’ అని బిగిన్ అయ్యే ఈ ట్రైలర్ ని బట్టి కంప్లీట్ సినిమా కథ సమంతా చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. ఒక ‘యూటర్న్’ దగ్గర రెగ్యులర్ గా జరిగే ఇన్సిడెంట్స్, ఆ ఇన్సిడెంట్స్ ని పోలీస్ దృష్టికి తీసుకు వెళ్ళే జర్నలిస్ట్ గా సమంతా ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది.

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు, ఉండీ లేనట్టుగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న హారర్ ఎలిమెంట్స్ తో రిలీజైన ఈ ట్రైలర్, సినిమాపై భారీ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది.

ఆది పినిశెట్టి, భూమిక కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాకి పూర్ణచంద్ర తేజస్వి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మరియు వివి కంబైన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు.