బ్లాక్ బస్టర్ గీతగోవిందం: 5 రోజుల్లో 50 కోట్లు

Monday,August 20,2018 - 01:30 by Z_CLU

గోవింద్, గీత కలిసి బాక్సాఫీస్ ను రఫ్ఫాడిస్తున్నారు. రికార్డులు కొల్లగొడుతున్నారు. వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. రిలీజైన ఫస్ట్ డే నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న గీతగోవిందం సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది. బడ్జెట్, కలెక్షన్ కంపేర్ చేసి చూస్తే.. ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ కింద లెక్క.

గత బుధవారం విడుదలైన ఈ సినిమా నిన్నటితో 5 రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఈ 5 రోజుల్లో (ఫస్ట్ వీకెండ్) గీతగోవిందం సినిమాకు వరల్డ్ వైడ్ 50 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అలా 5 రోజుల్లో 50 కోట్ల గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది గీతగోవిందం. మరోవైపు ఓవర్సీస్ లో బాలీవుడ్ సినిమాల కంటే ఈ మూవీకే వసూళ్లు ఎక్కువగా వస్తున్నాయి.

ఏపీ, నైజాం 5 రోజుల షేర్
నైజాం – రూ. 8.69 కోట్లు
సెడెడ్ – రూ. 3.35 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.18 కోట్లు
ఈస్ట్ – రూ. 1.78 కోట్లు
వెస్ట్ – రూ. 1.39 కోట్లు
గుంటూరు – రూ. 1.74 కోట్లు
కృష్ణా – రూ. 1.65 కోట్లు
నెల్లూరు – రూ. 0.68 కోట్లు