డబుల్ బ్లాక్ బస్టర్: గీతగోవిందం ఫస్ట్ వీక్ కలెక్షన్

Wednesday,August 22,2018 - 01:49 by Z_CLU

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీతగోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. గత వారం విడుదలైన ఈ సినిమా వారం రోజుల్లో వరల్డ్ వైడ్ 65 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 26 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇప్పటికే వసూళ్ల పరంగా డబుల్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమా, మరో 2 వారాల పాటు థియేటర్లలో స్ట్రాంగ్ గా కొనసాగే ఛాన్స్ ఉందని ట్రేడ్ ఎక్స్ పెక్ట్ చేస్తోంది.

గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయ్ ను స్టార్ హీరోగా మార్చేసింది. ఈ సినిమాతో అతడి మార్కెట్ వాల్యూ అమాంతం పెరిగింది. అటు రష్మిక కూడా టాప్ హీరోయిన్ అయిపోయింది. ఈ వసూళ్ల జోరు చూస్తుంటే.. అతి త్వరలోనే ఈ సినిమా 50 కోట్ల షేర్ సాధించిన సినిమాల క్లబ్ లోకి చేరడం గ్యారెంటీ

ఏపీ, నైజాం 7 రోజుల షేర్
నైజాం – రూ. 10.42 కోట్లు
సీడెడ్ – రూ. 3.90 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.85 కోట్లు
ఈస్ట్ – రూ. 2.11 కోట్లు
వెస్ట్ – రూ. 1.75 కోట్లు
గుంటూరు – రూ. 2.07 కోట్లు
కృష్ణా – రూ. 2.09 కోట్లు
నెల్లూరు – రూ. 0.83 కోట్లు