NTR విషయంలో త్రివిక్రమ్ ప్లాన్ వర్కవుట్ అయింది

Friday,August 17,2018 - 02:03 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ అవేటెడ్ మూవీ NTR ‘అరవింద సమేత’. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా చుట్టూ రోజురోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. స్పెషల్ గా NTR క్యారెక్టర్ విషయంలో. అందుకే టీజర్ విషయంలో త్రివిక్రమ్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా వర్కవుట్ అయింది.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్న దర్శకుడు త్రివిక్రమ్, ఈ టీజర్ లో స్టోరీ కన్నా, NTR పైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం ఫ్యాన్స్ పల్స్ ని స్ట్రేట్ గా రీచ్ అయింది. ‘జై లవకుశ’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత, సెట్స్ పైకి వచ్చిన NTR ని ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేయనున్నాడో ఈ టీజర్ లో ఎగ్జాక్ట్ గా ఎలివేట్ చేశాడు త్రివిక్రమ్.

అందుకే ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజైన ఈ సినిమా టీజర్, సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. జస్ట్ 2 రోజుల్లో ఈ టీజర్ 9 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి యూ ట్యూబ్ లో నంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతుందంటే   , ఈ సినిమాకి ఫ్యాన్స్ లో ఏ రేంజ్ లో డిమాండ్ క్రియేట్ అయి ఉందో తెలుస్తుంది.

అరవింద సమేతకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా దసరాకి  రిలీజ్ అవుతుంది.