ఆల్ టైం టాప్-10లో గీతగోవిందం

Monday,August 27,2018 - 10:54 by Z_CLU

బ్లాక్ బస్టర్ హిట్ అయిన గీతగోవిందం సినిమా ఇప్పుడు ఓవర్సీస్ టాప్-10 లీగ్ లోకి చేరింది. భారీ కలెక్షన్లు సాధిస్తే తప్ప ఈ క్లబ్ లోకి చేరడం కష్టం. అలాంటిది ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఓవర్సీస్ లో విడుదలైన గీతగోవిందం సినిమా ఆల్ టైం టాప్-10 లిస్ట్ లోకి ఎక్కేసింది.

ప్రస్తుతం ఈ మూవీ 2.10 మిలియన్ డాలర్ల వసూళ్లతో 9వ స్థానంలో కొనసాగుతోంది. వీకెండ్ వసూళ్లలో ఇది ఫిదాను క్రాస్ చేసింది. ఈ వీక్ కంప్లీట్ అయ్యేసరికి ఏకంగా ఖైదీ నంబర్ -150 వసూళ్లను కూడా అధిగమించేలా ఉంది.

ప్రస్తుతం ఓవర్సీస్ టాప్-10 వసూళ్లు ఇలా ఉన్నాయి

1. బాహుబలి 2 – 20 మిలియన్ డాలర్లు
2. బాహుబలి 1 – 6.9 మిలియన్ డాలర్లు
3. రంగస్థలం – 3.5 మిలియన్ డాలర్లు
4. భరత్ అనే నేను – 3.4 మిలియన్ డాలర్లు
5. శ్రీమంతుడు – 2.8 మిలియన్ డాలర్లు
6. మహానటి – 2.5 మిలియన్ డాలర్లు
7. అ ఆ – 2.4 మిలియన్ డాలర్లు
8. ఖైదీ నంబర్ 150 – 2.4 మిలియన్ డాలర్లు
9. గీతగోవిందం – 2.10 మిలియన్ డాలర్లు
10. ఫిదా – 2.07 మిలియన్ డాలర్లు