దిల్ రాజు ఒక్క సినిమాతో ఆగేలా లేడు...

Wednesday,July 17,2019 - 11:03 by Z_CLU

టాలీవుడ్ లో ‘దిల్ రాజు’ అంటేనే బ్రాండ్… అందుకే చిన్నగా తన బ్రాండ్ వ్యాల్యూని బాలీవుడ్ లో కూడా పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం ‘ఎవడు’ రీమేక్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ మరో రీమేక్ కి రంగం సిద్ధం చేస్తున్నాడు.

రీసెంట్ సూపర్ హిట్ మూవీ ‘జెర్సీ’ కూడా ఇప్పుడు బాలీవుడ్ లో తెరకెక్కబోతుంది.  ఈ సినిమాని అల్లు అరవింద్, దిల్ రాజు ఇద్దరు కలిసి నిర్మించబోతున్నారని తెలుస్తుంది. అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఈ 2 సినిమాలు బాలీవుడ్ లో సెట్స్ పైకి వచ్చేస్తే దిల్ రాజు అక్కడ కూడా సక్సెస్ ఫుల్ గా ఎస్టాబ్లిష్ అయినట్టే…

నిజానికి దిల్ రాజు ‘ఇండియన్ 2’ సినిమాతోనే ఈ ప్రాసెస్ బిగిన్ అవ్వాల్సింది కానీ కుదరలేదు. బేసిగ్గా సినిమాకి సంబంధించి ప్రతీది దగ్గరగా ఉండి చూసుకునే అలవాటు ఉన్న దిల్ రాజు, సొంత సినిమాలతోనే బాలీవుడ్ జర్నీ బిగిన్ చేయాలని ఫిక్సయినట్టున్నాడు. అందుకే తన బ్యానర్ లో హిట్టయిన సినిమాలతో బాలీవుడ్ లో తన మార్క్ క్రియేట్ చేయబోతున్నాడు.

ఇప్పుడు ‘ఎవడు’, ‘జెర్సీ’… ఈ సినిమాల తరవాత దిల్ రాజు బ్యానర్ నుండి ఏ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవుతుందనేది చూడాలి. మహా అయితే ఈ సినిమాల ఎగ్జిక్యూషన్ లో కొంచెం టైమ్ పడుతుందేమో కానీ, దిల్ రాజు మాత్రం ఈ 2 సినిమాలతోనే ఆగేలా లేడు.. బాలీవుడ్ ని సీరియస్ గా తీసుకున్నాడనే అనిపిస్తుంది.