‘ఇస్మార్ట్ శంకర్’ అసలు కథ అదే

Wednesday,July 17,2019 - 12:15 by Z_CLU

ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్… పక్కా హైదరాబాదీ… సినిమాలో రామ్ క్యారెక్టర్ ఇదే. ఇక కథ విషయానికి వస్తే హీరో మైండ్ లో ఒక చిప్ పెడతారు.. దాని చుట్టే అసలు కథ తిరుగుతుంది. అంటే సినిమా మొత్తంలో ఆ చిప్ పెట్టకముందు ఒక లెక్కా… పెట్టాక ఇంకో లెక్క అన్నట్టు… సినిమా ఉండబోతుంది.

హీరో మైండ్ లో చిప్ పెట్టాల్సిన అవసరం ఏం వచ్చింది..? అసలు హీరో మైండ్ లోకి ట్రాన్స్ ఫర్ అయ్యే మొమొరీ ఎవరిది..? దాని బ్యాక్ స్టోరీ ఏంటి…? ‘ఇస్మార్ట్ శంకర్’ కి ఆ పర్టికులర్ పర్సన్ కి మధ్య ఉండే రిలేషన్ ఏంటి..?’ ఈ పాయింట్స్ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ జనరేట్ చేయనున్నాయి. నిజం చెప్పాలంటే ఈ సినిమా అసలు కథ అక్కడే బిగిన్ అవుతుంది.

‘ఇస్మార్ట్ శంకర్’ క్యారెక్టర్ కి సినిమాలో స్ట్రాంగ్ పర్పస్ ఉండబోతుంది. మైండ్ లో చిప్ పెట్టడం వల్ల, మధ్యలోనే ఆగిపోయిన ఇంకేదో మిషన్ మళ్ళీ ట్రాక్ పైకి వస్తుంది. అదేంటనేది సినిమా చూస్తేనే కానీ తెలీదు.

రామ్ కరియర్ లోనే డిఫెరెంట్ సినిమాగా నిలవనుంది ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా చుట్టూ క్రియేట్ అవుతున్న బజ్ చూస్తుంటే, సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారంటీ అనే సూచనలే కనిపిస్తున్నాయి.