'గ్యాంగ్‌ లీడర్‌' థియేట్రికల్‌ ట్రైలర్‌ రెడీ

Monday,August 26,2019 - 11:48 by Z_CLU

నేచురల్‌ స్టార్‌ నాని, డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీఎంటర్టైనర్ ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’. ఇప్పటికే విడుదలైన టీజర్‌, సాంగ్స్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రంలో ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ ను ఆగష్టు 28 న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ నాని ప్రకటించాడు.

నాని మాట్లాడుతూ – ”నా అన్ని సినిమాల్లో నేను ఎక్కువ ఎంజాయ్‌ చేసిన సినిమా ఇదే. ప్రతి ఒక్కరూ ఒక పాజిటివ్‌ ఎనర్జీతో సినిమా స్టార్ట్‌ చేశారు. అందుకు తగ్గట్లే మంచి అవుట్‌ ఫుట్‌ వచ్చింది. ఆగష్టు 28న ‘గ్యాంగ్‌ లీడర్‌’ థియేట్రికల్‌ ట్రైలర్‌ను అన్ని థియేటర్స్‌లో ప్లే చేయబోతున్నాం..అలాగే ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ సెప్టెంబర్‌ మొదటి వారంలో విడుదల చేయబోతున్నాం. కార్తికేయ నెగటివ్‌ రోల్‌లో అదరగొట్టాడు. ఈ సినిమాలో మా గ్రూప్‌ పేరు రివెంజర్స్‌ అసెంబుల్డ్‌. తప్పకుండా మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది.”

నటుడు కార్తికేయ మాట్లాడుతూ – ” ‘గుణ 369’ షూటింగ్‌లో ఉండగా విక్రమ్‌ సర్‌ ఈ కథ చెప్పారు. కథ వినంగానే వెంటనే తప్పకుండా చేస్తాను సర్‌ అని చెప్పాను. ఇంత తక్కువ టైమ్‌లో ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్‌ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాలో నా క్యారెక్టర్‌ భయపెట్టే విధంగా ఉంటుంది. నేను సినిమాలోకి రావడానికి ఇన్స్పిరేషన్‌ అయిన నాని గారితో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం నిజంగా హ్యాపీ.”