నాని సెప్టెంబర్ సినిమాలు

Saturday,August 10,2019 - 11:41 by Z_CLU

నిజానికి ఆగష్టు 30 కే రిలీజవ్వాలి నాని ‘గ్యాంగ్ లీడర్’. కానీ ‘సాహో’ కూడా అదే రోజు ఫిక్సయ్యేసరికి రిలీజ్  ని సెప్టెంబర్ 13 కి పోస్ట్ పోన్ చేసుకున్నారు మేకర్స్. దీంతో నాని ‘గ్యాంగ్ లీడర్’ కూడా  సెప్టెంబర్ లో రిలీజయి సక్సెస్ అందుకున్న సినిమాల లిస్టులోకి చేరిపోయింది.

అష్టా చెమ్మా : న్యాచురల్ స్టార్ ని సిల్వర్ స్క్రెన్ కి పరిచయం చేసిన సినిమా. చిన్న సినిమాగా రిలీజయి క్లాసిక్ అనిపించుకుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ సెప్టెంబర్ 5.

పిల్ల జమీందార్ : ఇప్పటికీ బెస్ట్ స్క్రీన్ ప్లే సినిమా ప్రస్తావన వచ్చినపుడు ‘పిల్ల జమీందార్’ తప్పనిసరిగా డిస్కషన్ లో ఉంటుంది. నానిలోనే బెస్ట్ యాక్టర్ ఈ సినిమాలో రివీల్ అయ్యాడు. 29 సెప్టెంబర్ ఈ సినిమా రిలీజ్ డేట్.

భలే భలే మగాడివోయ్ : నాని కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ‘భలే భలే మగాడివోయ్’ మాత్రం, నానిని ఫుల్ ఫ్లెజ్డ్ గా నవ్వించే క్యారెక్టర్ లోనే ప్రెజెంట్ చేసింది. మతిమరుపు క్యారెక్టర్ లో న్యాచురల్ పర్ఫామెన్స్ తో నవ్వించి, సూపర్ హిట్ అందుకున్నాడు నాని. 4 సెప్టెంబర్ ఈ సినిమా రిలీజ్ డేట్.

మజ్ను : ఒకే సినిమాలో ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమించే హీరో… అందుకే ఈ సినిమాకి ‘మజ్ను’ అనే టైటిల్ పర్ఫెక్ట్ అనిపించింది. సెప్టెంబర్ 23 ఈ సినిమా రిలీజ్ డేట్.

దేవదాస్ : నాగార్జున లాంటి సీనియర్ హీరోతో మల్టీస్టారర్.  సినిమాలో డా. దాస్ గా ఇన్నోసెంట్ యంగ్ స్టర్ లా కొత్తగా కనిపించిన నాని, ఈ సినిమాతో కూడా సెప్టెంబర్ కలిసొస్తుందనిపించుకున్నాడు. 27 సెప్టెంబర్ న రిలీజ్ అయిందీ సినిమా.

అందుకే ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ చుట్టూ కూడా స్ట్రాంగ్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. సెప్టెంబర్ లో రిలీజ్ కాబట్టి సినిమా సక్సెస్ గ్యారంటీ అని ఫిక్సయిపోయారు ఫ్యాన్స్.