ఫ్రైడే రిలీజ్

Wednesday,July 19,2017 - 02:51 by Z_CLU

జూలై 21 న రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్న సినిమాలతో ఎగ్జైటెడ్ గా ఉంది టాలీవుడ్. ఈ ఫ్రైడే  రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ తో పాటు అల్టిమేట్ థ్రిల్లర్స్ లా మెస్మరైజ్ చేయనున్న  రిలీజ్ కానున్న సినిమాలు ఇవే.

 

ఫిదా : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ ‘ఫిదా’. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా, సినిమా సక్సెస్ కి కావాల్సినంత ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేయడంలో సక్సెస్ అయింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేయనుందో చూడాలి.

 

వైశాఖం : బి. జయ డైరెక్షన్ లో తెరకెక్కిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ వైశాఖం. హరీష్, అవంతిక జంటగా నటించిన ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. D.J. వసంత్ మ్యూజిక్ ఇప్పటికే ఇంప్రెస్ చేసేసింది. B.A. రాజు నిర్మించిన ఈ సినిమా ఎంతవరకు ఎట్రాక్ట్ చేయనుందో ఈ వీకెండ్ తెలిసిపోతుంది.

 

దండుపాళ్యం 2 : గతంలో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన దండుపాళ్యం సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిందే దండుపాళ్యం 2. అర్జున్ జన్య మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా శ్రీనివాస రాజు డైరెక్షన్ లో తెరకెక్కింది. వెంకట్ ఈ సినిమాకి నిర్మాత. దండుపాళ్యం తరహాలో దండుపాళ్యం2 కూడా అదే రేంజ్ లో సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిలిమ్ మేకర్స్.

టీమ్ 5: భారత జాతీయ క్రికెట‌ర్ గా త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీశాంత్, ఇప్పుడు టీమ్-5 అనే చిత్రం ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌యం కానున్నాడు. సురేష్ గోవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో  కన్నడ భామ నిక్కీ గర్లాని కథానాయికగా నటిస్తోంది. అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీశాంత్ బైక్ రేస‌ర్ గా క‌నిపించ‌నున్నాడు.  అల్టిమేట్ స్పోర్ట్స్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రేస్ లో ఎ ప్లేస్ లో నిలబడుతుందో చూడాలి.

 

మాయామాల్ : దిలీప్, ఈషా, దీక్షాపంత్ నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ ‘మాయామాల్’. సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా గోవింద్ లాలం డైరెక్షన్ లో తెరకెక్కింది. K.V. హరికృష్ణ ఈ సినిమాకి ప్రొడ్యూసర్. ఇప్పటికే ఇంటరెస్టింగ్ ట్రేలర్ తో ఎట్రాక్ట్ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేయనుందో చూడాలి.