వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ

Wednesday,July 19,2017 - 04:14 by Z_CLU

వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘ఫిదా’ రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమా కచ్చితంగా ఫ్యాన్స్ తో పాటు అందరికీ నచ్చుతుందంటున్నాడు. శేఖర్ కమ్ముల వర్కింగ్ స్టయిల్, హీరోయిన్ సాయి పల్లవితో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి వరుణ్ తేజ్ ఏమంటున్నాడో చూద్దాం.

 

అది నాకు మేటర్ కాదు

ఫిదాలో హీరోయిజం లేదు. అవసరం లేదు కూడా. ఈ సినిమా ఒప్పుకోవడాని మెయిన్ రీజన్ శేఖర్ కమ్ముల గారి కథే. నిజానికి హీరోయిజం నాకు పెద్ద మేటర్ కాదు. ఎమోషన్ పండించగలిగే కథ దొరికినప్పుడు అవన్నీ పట్టించుకోను. ఈ సినిమాలో శేఖర్ గారు రెండు ఫైట్స్ తీశారు. కానీ ఒకటి తీసేశారు. అభిమానులు కూడా సినిమా బాగుందా లేదా అని మాత్రమే చూస్తారు. హీరోయిజం ఉందా లేదే అని దీర్ఘంగా ఆలోచించరు. కొన్ని సినిమాల్లో హీరోయిజం లేకపోయినా ఎమోషన్ వారిని బాగా ఆకట్టుకుంటుంది. కొన్ని సినిమాలకు వాళ్ళు కూడా హీరోయిజం ఎక్స్పెక్ట్ చేయకుండానే థియేటర్స్ కి వస్తారు. అలాంటి సినిమానే ఫిదా.

 

పక్కా శేఖర్ కమ్ముల సినిమా

శేఖర్ కమ్ముల గారి సినిమాలు చాలా నేచురల్ గా ఏదో పక్కింట్లోనే, మనింట్లోనో జరిగే కథల్లాగే ఉంటాయి. ఆయన సినిమాల్లో స్ట్రాంగ్ స్టోరీ అంటూ ఉండదు. కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్ తో కథను అల్లుతారు. ఈ సినిమా కూడా ఆయన స్టైల్లోనే నేచురల్ గా ఉంటుంది. ఈ సినిమాను నిజామాబాద్ జిల్లా బాన్సువాడ లో షూటింగ్ చేశాం. అసలు ఒరిజినల్ ప్లేస్ కి వెళ్లి సినిమా చేయనక్కర్లేదు. సెట్ వేసుకోవచ్చు కానీ శేఖర్ గారు నేచురల్ గానే ఉండాలని భావించి అక్కడికే వెళ్లి అక్కడి వాళ్ళతోనే షూటింగ్ చేశారు. ఆ నేచురాలిటీ సినిమాలో బాగా కనిపిస్తుంది.


అభిమానులు బయటికొచ్చారు

శేఖర్ కమ్ముల గారి సినిమాలు ఇష్టపడే వారు చాలామంది ఉన్నారు. ఆయన మేకింగ్ స్టైల్ తో సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఫిదా టీజర్, ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి సార్ ఎక్కడో దాక్కున్న మీ ఫాన్స్ అందరు ఒక్కసారి గా బయటికొచ్చారు అని అన్నాను. ఆయన కూడా నవ్వారు. ప్రస్తుతం ఆయన లవ్ స్టోరీ సినిమాలు ఇష్టపడే వారందరు ఈ సినిమా చూసి కచ్చితంగా మళ్ళీ ఫిదా అవుతారు.

 

శేఖర్ గారు కాన్ఫిడెంట్ గా చెప్పారు

ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ అని చెప్పగానే చాలా హ్యాపీ గా ఫీలయ్యాను. తను నటించిన సినిమాలు చూశాను. సెట్ లోకి రాగానే తనని చూసి మా ఇద్దరి హైట్ కి వర్కౌట్ అవుతుందా..లేదా అనుకున్నాను. కొన్ని సీన్స్ లో ఆమె నా హైట్ కి మ్యాచ్ అయ్యేలా ఆపిల్ బాక్సులు వేయమని అడిగాను. అలాగే ఉండాలి మీరు అలా ఉంటేనే బాగుంటుంది, మీ పెయిర్ క్యూట్ గా ఉంటుంది అని శేఖర్ గారు కాన్ఫిడెంట్ గా చెప్పారు. రీసెంట్ గా మా ఇద్దరి కెమిస్ట్రీ కి వచ్చిన రెస్పాన్స్ విని చాలా హ్యాపీ గా ఫీలవుతున్నాను. సాయి పల్లవి క్యారెక్టర్ సినిమాకు హైలైట్ అవుతుంది.

 

ఆ విషయంలో కొంచెం కష్టపడ్డాను

ఈ సినిమాలో మెడిసిన్ చేసే ఎన్.ఆర్.ఐ గా కనిపిస్తాను. కథ చెప్పినప్పుడే నా క్యారెక్టర్ బాగా నచ్చింది. సో ఎన్నారైగా నటించడానికి కొంచెం కష్టపడ్డాను. చిన్నప్పటి నుంచే హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను కాబట్టి ఎన్.ఆర్.ఐ లాంగ్వేజ్ పట్టుకోవడానికి సైలెంట్ గా ఉండటానికి కొంచెం వర్క్ షాప్ చేశాను.

 

సినిమా లేట్ అవ్వలేదు

ఈ సినిమా చాలా లేట్ అయ్యిందని అంటుంటే విన్నాను. కానీ నాకు కాలు ఫ్రాక్చర్ అవ్వడం వల్లే కొంచెం డీలే అయింది. అది కూడా మేం అనుకున్నదానికంటే ఒక పది రోజులు మాత్రమే లేట్ అయింది. అంతే తప్ప షూటింగ్ కి పెద్దగా టైం తీసుకోలేదు.


వాటి గురించి ఆలోచించను

నిజంగా సినిమా చేశామా..అది జనాలకి నచ్చిందా అని మాత్రమే ఆలోచిస్తాను. కలెక్షన్స్ గురించి అంతగా ఆలోచించను. కానీ నిర్మాతలకి పెట్టిన డబ్బు తో పాటు లాభం వచ్చి వాళ్ళు మరో సినిమా చేయాలని మాత్రమే కోరుకుంటాను అంతే.

 

నాన్న ఫుల్ హ్యాపీ

ఫిదా కథ నాన్న వినలేదు. సో రీసెంట్ గా సినిమా చూసి చాలా హ్యాపీ గా ఫీలయ్యారు. సినిమా చూసి చాలా సేపు ఫోన్ లో మాట్లాడారు. సో నాన్న సినిమా చూసి ఫిదా అయిపోయారు. రేపు ఆడియన్స్ కూడా అలాగే ఫిదా అవుతారని ఆశిస్తున్నాను.

 

ఇంకా చూడలేదు.

సినిమా చాలా బాగా వచ్చిందని విన్నాను. ఇంకా మొత్తం చూడలేదు. ఎడిటింగ్ జరిగే టప్పుడు, డబ్బింగ్ అప్పుడు బిట్ బిట్ గా చూశాను.ఈరోజు కానీ రేపు కానీ పెదనాన్న తో కలిసి చూస్తాను.

 

అప్ కమింగ్ ప్రాజెక్టులు

ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాను. ఇంకా  2-3 కథలపై వర్క్ జరుగుతోంది. ఫిదా రిలీజ్ తర్వాత చెబుతా. మరోవైపు రామ్ చరణ్ బ్యానర్ లో కూడా చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. రాత్రి కూడా మాట్లాడుకున్నాం. మంచి కథ కోసం చూస్తున్నాం. తన బ్యానర్ లో చేయమని చరణే నన్ను అడిగాడు. మొహమాటం కొద్దీ నేను అడగలేదు.