5 కోట్ల బడ్జెట్ తో రంగస్థలం సెట్

Wednesday,July 19,2017 - 12:30 by Z_CLU

టాలీవుడ్ లో ఇంటరెస్టింగ్ బజ్ క్రియేట్ చేసుకున్న రామ్ చరణ్ ‘రంగస్థలం’ ఇప్పటి వరకు రెండు భారీ షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక జూలై 24 నుండి బిగిన్ కాబోయే మూడో షెడ్యూల్ లో 35 రోజుల రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది సినిమా యూనిట్.

1980 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామా కోసం 5 కోట్లు స్పెండ్ చేసి మరీ విలేజ్ సెట్ ని నిర్మిస్తుంది ‘రంగస్థలం’ టీమ్. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ అధ్వర్యంలో జరుగుతున్న ఈ సెట్ నిర్మాణం ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో జరుగుతుంది.

రామ్ చరణ్, సమంతా, ఆది పినిశెట్టి  కాంబినేషన్ లో సినిమాలోని అతి కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో తెరకెక్కించనున్నాడు సుకుమార్. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్  కంపోజర్.