ఫ్రైడే రిలీజ్

Thursday,June 01,2017 - 02:03 by Z_CLU

ఓవర్ హీట్ సమ్మర్ లో కూల్ కూల్ సినిమాలతో ఆల్ సెట్ మోడ్ లో ఉంది ఈ వీక్ బాక్సాఫీస్. ఈ ఫ్రైడే రిలీజవుతున్న సరికొత్త సనిమాలు ఇవే…

అంధగాడు : రాజ్ తరుణ్-హెబ్బా పటేల్ హీరో హీరోయిన్స్ గా A.K. ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ పై తెరకెక్కిన మూవీ `అంధ‌గాడు`. కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం-ఆడోర‌కం వంటి సూపర్ హిట్ సినిమలాతో క్రేజీ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ ఈ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్.  వెలిగొండ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించాడు. రాజేంద్ర‌ప్రసాద్ కీ రోల్ ప్లే చేసిన ఈ ‘అంధగాడు’ ఈ ఫ్రైడే నుండి థియేటర్స్ సందడి చేయడానికి రెడీ అయిపోతున్నాడు.

 

ఫ్యాషన్ డిజైనర్ : వంశీ డైరెక్షన్ లో 30 ఇయర్స్ బ్యాక్ తెరకెక్కి సూపర్ హిట్ అయిన సినిమా ‘లేడీస్ టైలర్’ కి సీక్వెల్ ఈ ‘ఫ్యాషన్ డిజైనర్’. సుమంత్ అశ్విన్ హీరోగా, అనీషా ఆంబ్రోస్, మనాలి రాథోడ్, మానస హిమవర్ష హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఈ ఫ్రైడే బాక్సాఫీస్ బరిలోకి దిగుతుంది. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని మధుర శ్రీధర్ నిర్మించాడు.

వెక్కిరింత :  రెండు ప్రేమ జంటల మధ్య వెరైటీ లవ్ స్టోరీస్ తో తెరకెక్కిన సినిమా వెక్కిరింత. నాగబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి చంద్రలేఖ మ్యూజిక్ కంపోజర్. ఈ ఫ్రైడే రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో పర్ఫామ్  చేస్తుందో చూడాలి.