15 భాషల్లో రోబో 2.0

Thursday,June 01,2017 - 03:19 by Z_CLU

బాహుబలి, దంగల్ తరవాత వరల్డ్ సినిమా కాన్వాస్ పై మరోసారి ఇండియన్ సినిమా స్టామినాని ప్రూవ్ చేయడానికి రెడీ అవుతుంది రజినీ కాంత్ 2.0. జనవరి 25, 2018 రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్న ఈ హై ఎండ్ టెక్నికల్ ఎంటర్ టైనర్ ని ఏకంగా 15 భాషల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్న సినిమా యూనిట్, విదేశీ డిస్ట్రిబ్యూటర్స్ తో అప్పుడే ఫైనాన్సియల్ డిస్కషన్స్ కూడా బిగిన్ చేసేశారు. బాహుబలి 2, దంగల్ బిజినెస్ స్ట్రాటజీనే ఈ సినిమాకు కూడా ఫాలో కానున్న సినిమా యూనిట్ భారీ సంఖ్యనే టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

 

హిందీ, తెలుగు, తమిళ, చైనీస్ భాషల్లో రిలీజైన దంగల్ ఇప్పటికే 2000 కోట్లు వసూలు చేసింది. ఇక తెలుగు, తమిళ, హిందీ, మళయాళ భాషల్లో రిలీజైన బాహుబలి 2, 1700 కోట్ల వసూళ్ళ వైపు పరుగులు పెడుతుంది. ఈ లోపు మాండరిన్ భాషలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉంది బాహుబలి సినిమా యూనిట్. ఇండియన్ సినిమా బిజినెస్ స్ట్రాటజీని మార్చిన ఈ 2 సినిమాల స్ట్రాటజీనే ఫాలో కానుంది 2.0 సినిమా యూనిట్.