అఖిల్ Mrమజ్ను నుండి ఫస్ట్ సింగిల్

Thursday,December 13,2018 - 01:59 by Z_CLU

నిన్ననే జనవరి 25 న Mr. మజ్ను రిలీజ్ అవుతుందని కన్ఫమ్ చేశారు మేకర్స్. రిలీజ్ డే ఆల్మోస్ట్ దగ్గరగా ఉండటంతో అప్పుడే ప్రమోషన్ ప్రాసెస్ కూడా స్పీడ్ పెంచేశారు. రేపే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. ‘ఏమయిందో…’ అనే ఈ మెలోడీ  సాంగ్  Mr మజ్ను పై మరింత బజ్ క్రియేట్ చేయబోతుంది.

ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉండబోతున్నాయన్నది ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ లేదు కానీ, వయోలిన్, స్ట్రింగ్ సెక్షన్స్ తో కంపోజ్ అయిన ఈ సాంగ్ యూత్ ని ఇంప్రెస్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్. రేపు మార్నింగ్ 9 నుండి సోషల్ మీడియాలో సందడి చేయబోతుంది ఈ పాట.

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి వెంకీ అట్లూరి డైరెక్టర్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై B.V.S.N. ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.