వచ్చే నెలలోనే అఖిల్ మరో సినిమా

Thursday,January 24,2019 - 11:03 by Z_CLU

రేపు రిలీజవుతుంది అఖిల్ ‘మిస్టర్ మజ్ను’. అయితే ఈ అక్కినేని హీరో ఓ వైపు ఈ సినిమా ప్రమోషన్ పనులు చూసుకుంటూనే, మరోవైపు తన నెక్స్ట్ సినిమా ప్రిపరేషన్స్ కూడా బిగిన్ చేసేశాడు. ఫిబ్రవరిలో మరో సినిమా లాంచ్ చేయనున్నాడు అఖిల్. మార్చి లో ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేస్తుంది.

ఫస్ట్ సినిమా ‘అఖిల్’ ఆ తరవాత రిలీజైన ‘హలో’ కి మధ్య చాలా గ్యాప్ తీసుకున్నాడు అఖిల్. ‘హలో’ తరవాత కూడా ‘మిస్టర్ మజ్ను’ స్టార్ట్ చేయడానికి పెద్దగా తొందరపడలేదు. మొత్తానికి కరియర్ బిగిన్ చేసినప్పటి నుండి ఏడాదికో సినిమాతో సరిపెట్టుకున్న అఖిల్, ఇక నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి ఫిక్సయ్యాడు.

ఇక ఈ ఫిబ్రవరిలో లాంచ్ కానున్న ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరా అనే డీటేల్స్ ప్రస్తుతానికి బయటికి రాకపోయినా, ‘మిస్టర్ మజ్ను’ హడావిడి కాస్త సద్దుమణిగాక, పూర్తి డీటేల్స్ అనౌన్స్ చేస్తామని చెప్పుకున్నాడు అఖిల్.