‘మిస్టర్ మజ్ను’ BGM జ్యూక్ బాక్స్ త్వరలో...

Tuesday,February 05,2019 - 06:24 by Z_CLU

‘మిస్టర్ మజ్ను’ సక్సెస్ కి బ్యాక్ బోన్ తమన్ అందించిన మ్యూజిక్. సినిమా రిలీజ్ కి ముందు ఈ సినిమా సాంగ్స్ భారీ అంచనాలు క్రియేట్ చేస్తే, సినిమాలోని కీలక సన్నివేశాల్లో తమన్ ఇచ్చిన BGM స్కోర్, సినిమాని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది. అందుకే ఫ్యాన్స్ ని ఆ రేంజ్ లో మెస్మరైజ్ చేసిన BGM స్కోర్ ని ఫిబ్రవరి 8 న జ్యూక్ బాక్స్ గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

అఖిల్ ఇంట్రడక్షన్ సీన్ నుండి బిగిన్ అయితే క్లైమాక్స్ వరకు ప్రతి ఎమోషన్ ని స్ట్రేట్ గా రీచ్ అయ్యేలా చేసింది తమన్ BGM స్కోర్. మరీ ముఖ్యంగా సినిమా సెకండాఫ్ లోని ఎమోషనల్ సీక్వెన్సెస్ లో తమన్ మ్యూజిక్ కీ రోల్ ప్లే చేసింది.

వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు ఈ సినిమాకి. నిధి అగర్వాల్ అఖిల్ కి పర్ఫెక్ట్ ఆన్ స్క్రీన్ జోడీ అనిపించుకుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై B.V.S.N ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు.