‘మిస్టర్ మజ్ను’ సెన్సార్ క్లియర్

Monday,January 21,2019 - 06:31 by Z_CLU

జనవరి 25 న గ్రాండ్ గా రిలీజవుతుంది మిస్టర్ మజ్ను. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుని సినిమాని వైడ్ రేంజ్ లో రీచ్ అయ్యేలా చేసిన మేకర్స్, మరింత అగ్రెసివ్ గా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ లోపు సెన్సార్ కూడా క్లియర్ చేసుకున్న ‘మిస్టర్ మజ్ను’ ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ పొందింది.

గతంలో రిలీజైన ఈ సినిమా టీజర్ లో అఖిల్ క్యారెక్టర్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన మేకర్స్, లేటెస్ట్ ట్రైలర్ లో  సినిమా స్టోరీలైన్ ని రివీల్ చేసి, సినిమాపై  మరింత క్యూరియాసిటీని రేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు.

ఫుల్ ఆఫ్ యూత్ ఎలిమెంట్స్ తో పాటు, మనసుని కదిలించే ఇమోషనల్ సీక్వెన్సెస్ తో తెరకెక్కిన ఈ లవ్ ఎంటర్ టైనర్ పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.

వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. తమన్ మ్యూజిక్ కంపోజర్. BVSN ప్రసాద్ ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు.