రానా ‘హిరణ్య’ సినిమా అప్డేట్స్

Thursday,December 13,2018 - 03:02 by Z_CLU

రానా కరియర్ లోనే మరో మైల్ స్టోన్ లాంటి మూవీ రాబోతోంది. అదే  ‘హిరణ్య’. భారీ బడ్జెట్ తో హెవీ గ్రాఫిక్ వర్క్ తో మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ఫాస్ట్ పేజ్ లో జరుగుతుంది. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ ని లాక్ చేసుకున్న దర్శకుడు గుణశేఖర్, సినిమాని మ్యాగ్జిమం 2019 సెకండాఫ్ లో సెట్స్ పైకి తీసుకు వచ్చే ప్రాసెస్ లో ఉన్నాడు.

ఫిల్మ్ మేకర్స్ నుండి అఫీషియల్ గా ఎటువంటి అప్డేట్ లేదు కానీ, ఇన్ సైడ్ సోర్సెస్ ద్వారా తెలుస్తున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో రానా గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో  కనిపించబోతున్నాడట. విష్ణువు 10వ అవతారమైన  నరసింహస్వామి చేతిలో చనిపోయే హిరణ్యకశిపుడిలా రానా, మరో గ్రాండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోయే క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.   

మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ అంటేనే భారీ స్థాయిలో సెట్స్ కంపల్సరీ. అందుకే ఈ సినిమా టీమ్ జనవరి నుండి ఫుల్ టైమ్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయబోతోంది. రామకృష్ణ సబ్బాని, మోనికా ఈ సినిమాకి ఆర్ట్ డిజైనింగ్ చేయనున్నారు. సురేష్ బాబు, ఫాక్స్ స్టార్ స్టూడియో బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ సినిమా బడ్జెట్ 180 కోట్లు అని అంచనా.