2018 టాప్ ట్రెండింగ్ లో 2.O

Thursday,December 13,2018 - 01:30 by Z_CLU

రజనీకాంత్, శంకర్ కాంబోలో తెరకెక్కిన 2.O మూవీ మరో అరుదైన గుర్తింపు దక్కించుకుంది. ఈ ఏడాది అత్యధికంగా ట్రెండింగ్ అయిన సినిమాగా 2.Oను ప్రకటించింది గూగుల్. డిసెంబర్ నెలలో ప్రతి ఏటా ట్రెండింగ్స్ లిస్ట్ ను విడుదల చేస్తుంది గూగుల్. ఈ ఏడాది ట్రెండింగ్స్ లో 2.O నిలిచింది.

దేశంలో అత్యధికంగా సినిమా అభిమానులు సెర్చ్ చేసిన, ట్రెండ్ చేసిన మూవీగా 2.O నిలిచింది. ఈ మూవీ తర్వాత సెకెండ్ ప్లేస్ లో బాగి-2 నిలిచింది. ఇక మూడో స్థానంలో సల్మాన్ నటించిన రేస్-3 సినిమా టాప్ ట్రెండింగ్ లో నిలిచింది.

2018 లో ఇండియా టాప్-10 ట్రెండింగ్ మూవీస్ ఇవే
1. 2.O
2. బాగి-2
3. రేస్-3
4. ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్
5. టైగర్ జిందా హై
6. సంజు
7. పద్మావతి
8. బ్లాక్ పాంథర్
9. దఢక్
10. డెడ్ పూల్-2