ఇది ‘మిస్టర్ మజ్ను’ వీకెండ్

Sunday,March 17,2019 - 09:50 by Z_CLU

ఈ వీకెండ్ ‘మిస్టర్ మజ్ను’ డామినేట్ చేయనుంది. రీసెంట్  గా రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ లవ్ ఎంటర్ టైనర్ ‘జీ తెలుగు’ లో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు  వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలీకాస్ట్ కానుంది.

గత 2 సినిమాల్లాగే అఖిల్ ఈ సినిమా విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నాడు. సాధారణంగా సినిమాలోని యాక్షన్ ఎలిమెంట్స్ కోసం హీరోలు మేకోవర్ చేస్తారు. కానీ ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ కోసం కాకుండా,   జస్ట్ టైటిల్ సాంగ్ కోసమే కష్టపడి మరీ 8 యాబ్స్ లో కనిపించాడు అఖిల్. ఆ సాంగ్ కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో, సినిమాలో అఖిల్ స్టెప్స్ కి, లుక్స్ కి కూడా అదే స్థాయి రెస్పాన్స్ వచ్చింది.

ఫస్ట్ మూవీతోనే లవర్ బాయ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న అఖిల్ ని డిఫెరెంట్ డైమెన్షన్ లో ప్రెజెంట్ చేసింది ‘మిస్టర్ మజ్ను’. రిలేషన్ షిప్స్ అంటేనే పెద్దగా నమ్మని కుర్రాడిలా అఖిల్ పర్ఫామెన్స్ జస్ట్ అవుట్ స్టాండింగ్. దానికి తోడు నిధి అగర్వాల్ గ్లామరస్ పర్ఫామెన్స్ సినిమాని ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు అనిపించేంతలా మెస్మరైజ్ చేశాయి.

Mr Majnu – This Sunday at 6 PM only on Zee Telugu

#WorldTelevisionPremiere of Akhil Akkineni and Nidhhi Agerwal 's Youthful Entertainer #MrMajnu – This Sunday at 6 PM only on #ZeeTelugu#MrMajnuOnZeeTelugu

Posted by Zee Telugu on Sunday, 10 March 2019

దర్శకుడు వెంకీ అట్లూరి స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేసిందీ సినిమా. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా అదే స్థాయిలో ప్రెజెంట్ చేయడంలో సూపర్ సక్సీడ్ అయ్యాడు ఈ ఫిల్మ్ మేకర్. వరల్డ్ వైడ్ గా రొమాంటిక్ సీజన్ ని క్రియేట్ చేసిన ఈ ‘మిస్టర్ మజ్ను’ ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా అలరించనుంది. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ‘జీ తెలుగు’ లో ప్రసారమవుతుంది ‘మిస్టర్ మజ్ను’.