నారా రోహిత్ రాబోయే సినిమాల హంగామా – బర్త్ డే విషెస్

Wednesday,July 25,2018 - 03:49 by Z_CLU

ఈ రోజు నారా రోహిత్ బర్త్ డే. డిఫెరెంట్ సినిమాలు చేస్తూ కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న ఈ హీరో ఈ రోజు తన 34 వ పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా నారా రోహిత్ లిస్టు లో ఫిక్స్ అయిన సినిమాల దగ్గరి నుండి సెట్స్ పైకి వచ్చిన సినిమా టీమ్స్, ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేసి విషెస్ అందజేశారు.

నారా రోహిత్ కి బర్త్ డే సందర్భంగా నిన్న ‘వీర భోగ వసంత రాయలు’ సినిమాలోని  నారా రోహిత్ లుక్స్ ని రివీల్ చేసింది సినిమా యూనిట్. జస్ట్ టైటిల్ తోనే ఈ సినిమా చుట్టూ క్యూరియాసిటీ రేజ్ చేసిన ఫిల్మ్ మేకర్స్, నిన్న రిలీజ్ చేసిన ఈ  పోస్టర్ తో సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేశారు.

1971 లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కనున్న సినిమా ‘అనగనగా దక్షిణాదిలో’.  జనవరిలో సెట్స్ పైకి రానున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. చైతన్య దంతులూరి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు. ఈ సినిమా ఆరన్ మీడియా వర్క్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది.

S.D. చక్రవర్తి డైరెక్షన్ లో సినిమాకి ఆల్రెడీ సంతకం చేశాడు నారా రోహిత్. ఈ సినిమాని నరేంద్ర బాబు చిగురుపాటి నిర్మిస్తున్నాడు. జర్నలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని అక్టోబర్ లో సెట్స్ పైకి తీసుకురానున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని డీటేల్స్ తెలియాల్సి ఉంది.

బాణం సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయి, ఒక పర్టికులర్ ఇమేజ్ కే పరిమితం కాకుండా, డిఫెరెంట్ జోనర్స్ సినిమాలు చేస్తూ ఎంటర్ టైన్ చేస్తున్న నారా రోహిత్, ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది జీ సినిమాలు.