ఈషా రెబ్బ ఇంటర్వ్యూ

Wednesday,July 25,2018 - 06:05 by Z_CLU

ఏ పని చేసినా బ్రాండ్ వ్యాల్యూను మైండ్ లో పెట్టుకునే హీరో పనిమనిషి తో లవ్ లో పడటం… ఆ తరవాత ఆ హీరో  ఫేస్ చేసే ఫన్నీ  ఎలిమెంట్స్  తో,  హిలేరియస్  ఎంటర్ టైనర్  గా తెరకెక్కింది బ్రాండ్ బాబు సినిమా. ప్రభాకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఈ షా రెబ్బ హీరోయిన్ గా నటించింది. సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్న ఈషా ఈ సినిమా గురించి, కరియర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకుంది…

సినిమాలో నా రోల్…

ఈ సినిమాలో నా క్యారెక్టర్ పనిమనిషి. ఒక పనిమనిషికి రిచ్ ఫెలో కి మధ్య క్రియేట్ అయ్యే లవ్, దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్,  మిస్ అండర్ స్టాండింగ్స్ , ఫన్. ఇదే బ్రాండ్ బాబు సినిమా.

అందుకే చేశా…

మారుతి గారు స్టోరీ చెప్పగానే నచ్చేసింది. స్పెషల్ గా నా క్యారెక్టర్. నేను ఏ సినిమా చేసినా నా క్యారెక్టర్ కొంచెం డిఫెరెంట్ గా ఉండాలి అనుకుంటా… అందుకే ఇమ్మీడియట్ గా ఓకె చెప్పేశా…

నెక్స్ట్ సినిమాలు…

NTR అరవింద సమేత లో హీరోయిన్ గా నటిస్తున్నాను. ఫస్ట్ టైమ్ ఇంత పెద్ద సినిమాలో పని చేయడం, చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ సినిమాతో పాటు సుమంత్ తో సుబ్రహ్మణ్యపురం చేస్తున్నాను.

పని మనిషిలా…

సినిమా చేసేటప్పుడు ప్రభాకర్ గారు చాలా హెల్ప్ చేశారు. ఎగ్జాక్ట్ పనిమనిషిలా కనిపించడానికి బాడీ లాంగ్వేజ్ దగ్గరి నుండి మ్యానరిజం ప్రతీది చేసి చూపించారు… కొంచెం మా పని మనిషిని చూసి కూడా నేర్చుకున్నా…

అరవింద సమేతలో…

NTR అరవింద సమేతలో నాది చాలా డిఫెరెంట్ క్యారెక్టర్. రెబల్ లా కనిపిస్తాను ఈ సినిమాలో. ఇప్పటి వరకు నేను అలాంటి క్యారెక్టర్ ప్లే చేయలేదు.

రూమర్స్ గురించి…

సర్ ప్రైజింగ్ అవుతుంటా… కొన్ని రూమర్స్ అయితే ఊహకు అందనివి ఉంటాయి. అంత క్రియేటివ్ థాట్స్ వీళ్ళకు ఎలా వస్తాయి అనిపిస్తుంటుంది. అంతే కానీ వాటిని నేనస్సలు సీరియస్ గా తీసుకోను…

 

అదీ విషయం…

సినిమా సినిమాకి గ్యాప్ వస్తున్న మాట నిజమే. నేను మరీ చూజీగా ఉంటున్నాను అని చెప్పలేను కానీ వింటున్న కథల్లో కనెక్ట్ అయిన సినిమాలే చేస్తున్నాను…

పక్కా హైదరాబాదీ….

మా నాన్నది రాజమండ్రి, అమ్మది వరంగల్.. నేను పుట్టి పెరిగింది కంప్లీట్ గా హైదరాబాద్ లోనే.

నిద్ర కూడా పట్టదు…

మనం చేసే ప్రతి సినిమా హిట్టవ్వాలని లేదు. సినిమా రిలీజ్ కి ముందు ప్రెజర్ వల్ల నిద్ర కూడా పట్టదు. మనకంతా  బాగానే ఉందనిపిస్తుంది. కానీ సినిమా జనాల్లోకి వెళ్లి వాళ్లకు నచ్చిందా లేదా…. తెలిసే వరకు టెన్షనే…

పెళ్ళి…

ప్రస్తుతానికి పెళ్ళి ఆలోచన లేదు… అలాంటిదేమైనా ఉంటే తప్పకుండా చెప్తాను…