క్యూరియాసిటీ రేజ్ చేస్తున్న నారారోహిత్ లుక్స్

Tuesday,July 24,2018 - 03:31 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది ‘వీర భోగ వసంత రాయలు’ సినిమా. ఈ సినిమాలో నారా రోహిత్ తో పాటు సుధీర్ బాబు, శ్రీవిష్ణు, శ్రియ శరణ్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. జస్ట్ టైటిల్ తోనే ఇంతకీ ఇది ఏ టైపు సినిమా..? అనే క్వశ్చన్ ని రేజ్ చేసిన ‘వీర భోగ వసంత రాయలు’, వరసగా ఫస్ట్ లుక్స్ తో ఎట్రాక్ట్ చేస్తుంది. రీసెంట్ గా శ్రియ శరణ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు నారారోహిత్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో నారా రోహిత్ ప్లే చేస్తున్న రోల్ ఏంటనేది ఎగ్జాక్ట్ గా తెలీదు కానీ ఫస్ట్ లుక్ ని బట్టి, ఒక చెయ్యి సరిగా పనిచేయని వాడిలా కనిపించనున్నాడని అర్థమవుతుంది. ఇక ఈ పోస్టర్ లో హైలెట్ చేసిన ‘HIT MAN’ ని బట్టి నారా రోహిత్ ఈ సినిమాలో ఎవరిని..? ఎందుకు చంపుతుంటాడు..? ఈ క్యారెక్టర్ కి ఉన్న బ్యాక్ స్టోరీ ఏమై ఉంటుందనే క్యూరియాసిటీ ఆడియెన్స్ లో రేజ్ అవుతుంది.

 

ఇంద్రసేన R. డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మార్క్ K. రాబిన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. బాబా క్రియేషన్స్ బ్యానర్ పై అప్పారావు బెల్లన ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.