అక్టోబర్ రిలీజ్

Monday,October 01,2018 - 01:15 by Z_CLU

అక్టోబర్ అనగానే దసరా సీజన్ బిగిన్ అయిపోతుంది. పండక్కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమా ప్రమోషన్స్ తో టాలీవుడ్ లో దసరా ఓ వీక్ ముందుగానే బిగిన్ అవుతుంది. అయితే ఈ నెలలో వరసగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాల వివరాలివే…

అక్టోబర్ ఫస్ట్ వీకెండ్ సినిమాల విషయానికొస్తే ఫస్ట్ గుర్తుకొచ్చేది విజయ్ దేవరకొండ ‘నోటా’ సినిమా. ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ ని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ప్రెజెంట్ చేస్తున్న ‘నోటా’ అక్టోబర్ 5 న గ్రాండ్ గా రిలీజవుతుంది. అయితే ఈ సినిమాతో పాటు మరో 2 సినిమాలు ‘దేశంలో దొంగలు పడ్డారు’ ‘వీర భోగ వసంత రాయలు’ భలే మంచి చౌక బేరమ్’ సినిమాలు కూడా అదే రోజు రిలీజవుతున్నాయి.

ఇక అక్టోబర్ సెకండ్ వీకెండ్ అందునా మోస్ట్ అవేటెడ్ ఫెస్టివ్ వీకెండ్. దసరా కానుకగా అక్టోబర్ 11 న గ్రాండ్ గా రిలీజవుతుంది NTR అరవింద సమేత. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందే వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా రిలీజైన నెక్స్ట్ డే భైరవ గీత, ‘బేవర్స్’ తో పాటు ‘అదుగో’ సినిమాలు అక్టోబర్ 12 న రిలీజవుతున్నాయి.

ఇక ఇదే నెల థర్డ్ వీకెండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాలు ‘హలో గురూ ప్రేమ కోసమే’, ‘పందెం కోడి 2’. ఈ వీకెండ్ 2 సినిమాలు పోటీ పడనున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అగ్రెసివ్ మోడ్ లో ప్రమోషన్స్ జరుపుకుంటున్న ఈ సినిమాల్లోంచి ఏయే సినిమాలు ఎక్స్ పెక్ట్ చేసిన సక్సెస్ ని అందుకుంటాయో చూడాలి.

ఇక లాస్ట్ వీకెండ్ విషయానికి వస్తే వరసగా సువర్ణ సుందరి, అమర్ అక్బర్ ఆంటోని, శుభలేఖలు, ఆపరేషన్ 2019 తో పాటు సుమంత్ ‘ఇదం జగత్’ కూడా  రిలీజయ్యే చాన్సెస్ ఉన్నాయి.  ఇంకా వీటి రిలీజ్ డేట్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి వస్తుంది.