మరో మల్టీ స్టారర్

Friday,May 26,2017 - 03:44 by Z_CLU

టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సీజన్ మళ్ళీ బిగిన్ అయింది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘శమంతక మణి’ లో నారా రోహిత్, సుధీర్ బాబు నటిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా పై ఆల్ రెడీ ఇంటరెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇదే కాంబో ఇంకో సినిమా కోసం రెడీ అవుతుంది.

R.ఇంద్రనీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మరో క్రైమ్ థ్రిల్లర్ ‘వీర భోగ వసంత రాయలు’ లో ఇద్దరూ కలిసి నటించనున్నారు. శ్రియ శరణ్, తో పాటు శ్రీ విష్ణు కూడా కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో డిఫెరెంట్ క్యారెక్టర్స్ లో ఎంటర్ టైన్ చేస్తున్నారు నారా రోహిత్, సుధీర్ బాబు. సొసైటీ లో ఉన్న సిచ్యువేషన్స్, వాటి ప్రభావం లాంటి ఇంటరెస్టింగ్ పాయింట్ తో, థ్రిల్లింగ్ క్రైమ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కనుంది ఈ సినిమా.  

రొటీన్ సినిమా ఫార్మూలాకు కాస్త డిఫెరెంట్ గా ఎవ్రీ సెకండ్ ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ తో డిజైన్ అవుతున్న ఈ సినిమా డెఫ్ఫినేట్ గా ట్రెండ్ సెట్టర్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.