నాగార్జున చేతుల మీదుగా ‘ఏక్’ ఆడియో రిలీజ్

Friday,December 01,2017 - 03:09 by Z_CLU

బిష్ణు, హిమాన్షి ఖురానా, అపర్ణ శర్మ హీరో హీరోయిన్స్ గా నటించిన అప్ కమింగ్ మూవీ ‘ఏక్’. రుద్రారపు సంపత్ డైరెక్షన్ లో తెరకెక్కిన లవ్ & యాక్షన్ ఎంటర్ టైనర్ ఆడియో నిన్న నాగార్జున చేతుల మీదుగా జరిగింది. భిక్షు హార్డ్ వర్క్, డెడికేషన్ చూస్తుంటే ఫ్యూచర్ లో పెద్ద స్టార్ అవుతాడని చెప్పిన నాగ్, ఈ మూవీ మంచి సక్సెస్ సాధించాలని కోరుకున్నారు.

బీయింగ్ హ్యూమన్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉంది. అల్టిమేట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కృష్ణ ప్రొడ్యూసర్. మంత్ర ఆనంద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘ఏక్’  మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయాల్సి  ఉంది.