త్వరలో సెట్స్ పైకి రానున్న సంఘమిత్ర

Friday,December 01,2017 - 04:02 by Z_CLU

200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ‘సంఘమిత్ర’ చాలా రోజుల నుండి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. హిస్టారికల్ అడ్వెంచరస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో జయం రవి, ఆర్య, అదితి, దిశా పటాని లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం స్పెషల్ గా స్వార్డ్ ఫైట్స్ లాంటి ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే మ్యాగ్జిమం ప్రీ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకున్న సినిమా యూనిట్, ఏప్రియల్ 11 నుండి సెట్స్ పైకి వచ్చే చాన్సెస్ కనిపిస్తున్నాయి.

సుందర్ C. డైరెక్షన్ లో ఈ సినిమాకు A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు, యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కనున్న ఈ సినిమా, ఇండియన్ సినిమా హిస్టరీ లో మైల్ స్టోన్ మూవీలా నిలిచిపోవడం గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.