డబ్బింగ్ స్టేజ్ లో వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’

Friday,December 01,2017 - 12:39 by Z_CLU

వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ డబ్బింగ్ పనులు బిగిన్ అయ్యాయి. ప్రస్తుతం ఇంకా సెట్స్ పై ఉన్న ఈ సినిమా, మరో వైపు డబ్బింగ్ పనులపై కూడా ఫోకస్ బిగిన్ చేసింది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

‘ఫిదా’ సినిమాతో ఫుల్ గా ఇంప్రెస్ చేసి లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న వరుణ్ తేజ్ ఈ సినిమాలో యాక్షన్ ప్యాక్డ్ లవర్ బాయ్ లా కనిపించనున్నాడు. డిఫెరెంట్ స్టోరీస్ ని ప్రిఫర్ చేస్తూ, తనకంటూ ప్రత్యేక ఇమేజ్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ సినిమాలతో స్పీడ్ మీదున్న వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ పై కూడా ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది.

 

 

మ్యాగ్జిమం షూటింగ్ లండన్ లో జరుపుకున్న ఈ మూవీని BVSN ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న ‘తొలిప్రేమ’ ఫిబ్రవరి 9 న రిలీజవుతుంది.