యంగ్ హీరోస్ పై ఫోకస్...

Monday,January 23,2017 - 06:16 by Z_CLU

ప్రెజెంట్ టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ యంగ్ హీరో ల పై ఫోకస్ పెడుతూ ముందుకెళ్తున్నాడు. మొన్నటి వరకూ స్టార్ హీరోలకే పరిమితమైన తన మ్యూజిక్ ను ఇప్పుడు యంగ్ హీరో లకు కూడా అందిస్తూ ఆ సినిమా విజయం లో ముఖ్య భాగం అవుతున్నాడు.

కెరీర్ ఆరంభం లో యంగ్ హీరోస్ అందరికీ మ్యూజిక్ అందిస్తూ వచ్చిన దేవి ఈ మధ్య మాత్రం పూర్తిగా స్టార్ హీరోలకే పరిమితం అవుతూ బడా సినిమాలతో బిజీ అయిపోయాడు. అయితే 2015 నుంచి యంగ్ హీరోల పై కూడా ఫోకస్ పెడుతూ తన మ్యూజిక్ తో హల్చల్ చేస్తున్నాడు దేవి. ఇప్పటికే రాజ్ తరుణ్, రామ్, నాని వంటి యంగ్ హీరోలకు వరుసగా మ్యూజిక్ అందిస్తున్న డి.ఎస్.పి త్వరలో వరుణ్ తేజ్ సినిమాకు కూడా మ్యూజిక్ అందించబోతున్నాడు. ఈ ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్న నిర్ణయంతో డి.ఎస్.పి మ్యూజిక్ కి డాన్స్ వేయాలనుకుంటున్న టాలీవుడ్ యంగ్ హీరోస్ అందరి కల నెరవేరబోతుందన్నమాట…