'సింగం-3' వాయిదా

Monday,January 23,2017 - 04:39 by Z_CLU

సూర్య నటించిన మోస్ట్ ఎవైటింగ్ మూవీ సింగం-3 మరో సారి వాయిదా పడింది. డిసెంబర్ నుంచి తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఊరిస్తున్న ఈ సినిమా జనవరి 26 విడుదలకి రెడీ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ డేట్ కి సంబంధించిన ప్రమోషన్ కూడా మొదలుపెట్టిన యూనిట్ తాజాగా పోస్ట్ ఫోన్ న్యూస్  అనౌన్స్ చేసి  రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు .

ఇక డిసెంబర్ లో ‘ధృవ’ రిలీజ్ కారణంగా మొదటి సారి పోస్ట్ ఫోన్ అయిన ఈ సినిమా రెండో సారి సెన్సార్ కారణంగా పోస్ట్ ఫోన్  అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రెజెంట్ తమిళ నాడులో ప్రస్తుత పరిస్థితుల వల్ల మరో సారి పోస్ట్ ఫోన్ అయినట్లు తెలిపారు మేకర్స్. మరి ఇప్పటికే మూడు సార్లు పోస్ట్ ఫోన్  అయిన సింగం గర్జించేదెప్పుడో? తెలియాలంటే మళ్ళీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకూ ఆగాల్సిందే..