BOSS Party Song ప్రోమో వచ్చేసింది

Tuesday,November 22,2022 - 12:05 by Z_CLU

Promo Of Party Song Of The Year- Boss Party From Megastar Chiranjeevi’ Waltair Veerayya is out now

మెగా స్టార్ చిరంజీవి మాస్ యాక్షన్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ నుండి ఫస్ట్ సింగిల్ ‘బాస్ పార్టీ’ రేపు రిలీజ్ కాబోతుంది. ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో చూపిస్తూ తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమోలో చిరంజీవి మాస్ లుక్ లో బ్యాక్ సైడ్ నుండి లుంగీ పైకెత్తి పట్టుకొని నడుస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. అలాగే సాంగ్ కి లీడ్ గా వచ్చే దేవి సింగింగ్ కూడా ఆకట్టుకుంటుంది. తాజాగా విడుదలైన ప్రోమో… సాంగ్ పై అంచనాలు పెంచేసింది. ట్యూన్ కంపోజ్ చేయడంతో పాటు లిరిక్స్ కూడా అందించాడు దేవి. రేపు సాయంత్రం 4: 05 నిమిషాలకు ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది.

బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్ ఫైనల్ స్టేజికి చేరుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ స్పెషల్ కేరెక్టర్ లో కనిపించనున్నాడు.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics