#WaltairVeerayya మాస్ సాంగ్ లోడింగ్ !

Saturday,October 29,2022 - 12:58 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ‘వాల్తేర్ వీరయ్య’. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ కేరెక్టర్ లో మాస్ మహారాజా రవితేజ కనిపించబోతున్నారు. ఇద్దరు స్టార్స్‌ ని కలిసి తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా కోసం ఓ మాస్ సాంగ్ షూట్ చేశారు. చిరంజీవి, రవితేజలపై మాస్ సాంగ్ షూటింగ్ పూర్తి చేసినట్లు ఇటివల ప్రకటించారు.

చిరంజీవి, రవితేజ గ్రేస్ ఫుల్ మూవ్స్, ఎనర్జీతో అలరించేలా మాస్ డ్యాన్స్ నంబర్‌ ను రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ చేశాడని తెలుస్తుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ సాంగ్ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇవ్వనుందని అంటున్నారు యూనిట్. భారీ సెట్‌ లో చిత్రీకరించిన మాస్ నంబర్ లో వీరిద్దరినీ చూడటం అభిమానులకు కన్నుల పండగ కానుంది. ఈ సాంగ్ త్వరలోనే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

చిరంజీవి వింటేజ్ అవతార్‌ లో కనిపించిన ఈ సినిమా టైటిల్ టీజర్‌ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి బాడీ లాంగ్వేజ్, వాకింగ్ స్టైల్, గెటప్, మ్యానరిజమ్స్ సినిమాపై అంచనాలు పెంచేసేలా చేస్తున్నాయి.

అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత.బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics