కొరటాల దృష్టిలో ఉన్న హీరోయిన్...?

Thursday,June 27,2019 - 11:03 by Z_CLU

మెగాస్టార్ 152 సినిమాలో హీరోయిన్ ఎవరు..? కొరటాల ఇప్పటికే హీరోయిన్ ని ఫిక్స్ చేసేసుకున్నాడా..? అయితే ఎవరు…? లేకపోతే నిన్నా మొన్నటి వరకు మెగాస్టార్ బిజీ కదా, కాస్త ఫ్రీ అయ్యాక డిస్కస్ చేసుకుని ఫిక్సవుదామని వెయిట్ చేస్తున్నాడా..? అసలు కొరటాల ఈ సినిమా హీరోయిన్ విషయంలో ఏం ఆలోచిస్తున్నాడు…

కొరటాల ఇప్పటి వరకు ఏ హీరోయిన్ తో రిపీటెడ్ గా వర్క్ చేయలేదు. అంటే ఈవరసలో సమంతా నుండి బిగిన్ అయితే అనుష్క, కైరా అద్వానీ, శృతి హాసన్ లేనట్టేనా…? అంటే ప్రతిసారిలా కొరటాల ఇప్పటి వరకు తన సినిమాలో పని చేయని హీరోయిన్ నే ప్రిఫర్ చేస్తాడా..? లేకపోతే ఈసారి ట్రాక్ మార్చి రిపీట్ చేస్తాడా..?

నిన్నా మొన్నటి వరకు ఈ వరసలో కీర్తి సురేష్ పేరు కూడా గట్టిగానే వినిపించింది. కానీ ఎక్కడ కన్ఫర్మేషన్ రాలేదు. అంతలో ఈ సినిమా హీరోయిన్ స్పేస్ ఇంకా కన్సిడరేషన్ స్టేజ్ లోనే ఉందని ఇంకో టాక్ బయటికి వచ్చింది.

నిజానికి ఈ సినిమా అనౌన్స్ అయ్యాక సెట్స్ పై రాకపోవడానికి రీజన్ ‘సైరా’ సినిమా. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి, రేపో మాపో ఈ సినిమా స్టార్ కాస్ట్ గురించి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రావచ్చని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్… చూడాలి మరీ.. కొరటాల దృష్టిలో ఉన్న ఆ లక్కీ హీరోయిన్ ఎవరో..?