బ్యాక్ టు బ్యాక్ మరో హ్యాట్రిక్ కొడతాడా?

Friday,March 30,2018 - 06:00 by Z_CLU

దర్శకుడిగా ఛాన్స్ రావడమే గొప్ప. అలా ఛాన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ మూవీతో హిట్ కొట్టిన వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ ఆ వెంటనే సెకెండ్ మూవీతో కూడా సక్సెస్ అందుకున్న వాళ్లు చాలా తక్కువ. ఇక థర్డ్ మూవీతో కూడా హిట్ కొట్టి, హ్యాట్రిక్ అందుకున్న వాళ్లు ఇంకా తక్కువ. అలా అతితక్కువ మంది దర్శకులకు మాత్రమే పరిమితమైన హ్యాట్రిక్ డైరక్టర్ల జాబితాలోకి చేరాడు అనిల్ రావిపూడి.

కళ్యాణ్ రామ్ ‘పటాస్’ తో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అనిపించుకున్న అనిల్ రావిపూడి, సుప్రీమ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. సాయి ధరమ్ తేజ్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసిన ఈ సినిమా,  అనిల్ రావిపూడిని ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ రేంజ్ ని తెచ్చిపెట్టింది. ఈ సినిమా తరవాత తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ అనిల్ రావిపూడి స్టేటస్ ని మరో మెట్టు పైకి తీసుకువెళ్ళింది.

ఇలా కెరీర్ స్టార్టింగ్ లోనే హ్యాట్రిక్ అందుకున్న అనిల్ రావిపూడి, ఇప్పుడు అదే ఊపులో డబుల్ హ్యాట్రిక్ కూడా బేస్ మెంట్ రెడీ చేశాడంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇందులో భాగంగా తన నాలుగో సినిమాకు ఏకంగా మల్టీస్టారర్ సెటప్ పెట్టాడు. వెంకీ, వరుణ్ హీరోలుగా ఎఫ్-2 సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీతో అనిల్ రావిపూడి డబుల్ హ్యాట్రిక్ కు రంగం సిద్ధం చేస్తాడేమో చూడాలి.

హిట్ ఫార్ములా తెలుసుకుని సినిమాలు చేస్తున్నాడా..? లేకపోతే ఎవర్ గ్రీన్ ఫార్ములా కామెడీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడా..? లాంటి క్వశ్చన్స్ పక్కన పెడితే, ఈ సారి కూడా ఈజీగా హిట్ కొట్టడం గ్యారంటీ అంటున్నాయి సినిమా వర్గాలు. సెట్స్ పైకి కూడా రాకముందే ఈ సినిమా క్రియేట్ చేస్తున్న పాజిటివ్ వైబ్స్ చూస్తుంటే, అనిల్ రావిపూడి సెకండ్ హ్యాట్రిక్ ని టార్గెట్ చేశాడన్నమాట.