సంక్రాంతి దర్శకుడు అనిపించుకుంటాడా..?

Tuesday,June 04,2019 - 10:02 by Z_CLU

ఒకప్పుడు సంక్రాంతి దర్శకుడు అంటే రాఘవేంద్ర రావవు గారే… సినిమాలలో కంటెంట్ అలాగే ఉండేది.. సినిమా  రిలీజయ్యాకే కలెక్షన్స్ కూడా అలాగే ఉండేవి… ఈ వరసలో చిన్నగా వి.వినాయక్ కూడా వచ్చాడు. ఇప్పుడు ఈ మాసివ్ డైరెక్టర్ స్పీడ్ తగ్గింది కానీ ఆయన చేసిన సినిమాల్లో 6 సినిమాలు సంక్రాంతికి రిలీజయినవే… ఇప్పుడీ వరసలో అనిల్ రావిపూడి రాబోతున్నాడా..?

రీసెంట్ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో కావాల్సినంత నవ్వించి… చాలనిపించినంత వసూలు చేసింది ‘F2’. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబుతో సంక్రాతి బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నాడు అనిల్ రావిపూడి. అసలే తన మార్క్ ఫ్రెష్ కామెడీ.. దానికి మహేష్ బాబు చరిష్మా కూడా జోడవుతుంది కాబట్టి అనుమానం లేదు సినిమా సక్సెస్ గ్యారంటీ అని నిర్మొహమాటంగా జోస్యం చెప్పేయవచ్చు.

సంక్రాంతి సినిమా అంటేనే ఫ్యామిలీ సినిమా. ఈ జోనర్ లో అనిల్ రావిపూడికి కావాల్సినంత పట్టు ఉంది. దీనికి తోడు తన కాన్ఫిడెన్స్ చూస్తుంటే, ఈ సినిమా కూడా బాక్సాఫీస్ బౌండరీలు దాటే అవకాశాలే కనిపిస్తున్నాయి. మహేష్ బాబు కామెడీ టైమింగ్ ఫ్యాన్స్ కి కొత్త కాదు కానీ, ఆర్మీ మేజర్ గా మహేష్ బాబుని  ఫస్ట్ టైమ్ చూడబోతున్నారు ఫ్యాన్స్.

ప్లాన్ చేసుకున్నాడో.. లేకపోతే మహేష్ బాబు కోసం ఏకంగా 6 నెలలు వెయిట్ చేశాడు కాబట్టి కలిసొచ్చిందో చెప్పలేం కానీ, ఈ సినిమా సక్సెస్ తో అనిల్ రావిపూడి కూడా సంక్రాంతి దర్శకుడు అనిపించుకోవడం గ్యారంటీ అనే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి…